Home /News /politics /

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆ నలుగురే’ అత్యంత ధనిక అభ్యర్థులు

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆ నలుగురే’ అత్యంత ధనిక అభ్యర్థులు

జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నారాయణ

జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రూ.895 కోట్ల ఆస్తులతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదటిస్థానంలో నిలిచారు.

    తెలుగురాష్ట్రాల్లో నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. దీంతో శుక్రవారం మంచి రోజు అని చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, మరో మంత్రి నారాయణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా భీమవరంలో నామినేషన్ వేశారు. అయితే, ఆయా అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ధ్రువీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయనతోపాటు భార్య, కుమారుడు పేరు మీద మొత్తం రూ.895 కోట్ల ఆస్తులు ఉ్ననాయి.

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి
    చరాస్తులు - రూ.223 కోట్లు
    స్థిరాస్తులు  - రూ. 36 కోట్లు

    విశ్వేశ్వర్ రెడ్డి భార్య కె.సంగీతారెడ్డి (అపోలో ఆస్పత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్)
    చరాస్తులు - రూ. 613 కోట్లు
    స్థిరాస్తులు - రూ.1.81 కోట్లు

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడి పేరిట చరాస్తులు - రూ. 20 కోట్లు

    అయితే, ఆయన కుటుంబంలో ఎవరికీ సొంత కారు కానీ, మోటార్ వాహనం కానీ లేకపోవడడం గమనార్హం. 2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.528 కోట్లుగా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత డిసెంబర్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు.

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి తర్వాత స్థానంలో ఏపీ మంత్రి నారాయణ నిలిచారు. నారాయణ విద్యాసంస్థల అధినేత అయిన పి.నారాయణ కుటుంబ ఆస్తుల మొత్తం రూ.667 కోట్లుగా ప్రకటించారు. ఆయన నెల్లూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

    మూడో ధనిక కుటుంబంగా చంద్రబాబునాయుడు కుటుంబం నిలిచింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున కుప్పంలో టీడీపీ నేతలు నామినేషన్ వేశారు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. వారు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తుల విలువ రూ.574 కోట్లు.
    వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.538 కోట్లు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Konda Vishweshwar reddy, Lok Sabha Election 2019, Nara Lokesh, Telangana Lok Sabha Elections 2019, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు