జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని లాగేసుకుంటాడా ?
తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెకండ్ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించినవేనా అనే ప్రచారం మొదలైంది.
news18-telugu
Updated: November 20, 2019, 11:21 AM IST

జూ ఎన్టీఆర్ (Twitter/Photo)
- News18 Telugu
- Last Updated: November 20, 2019, 11:21 AM IST
టీడీపీ రాజకీయాల్లో కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. టీడీపీని వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఏపీ మంత్రి, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని సైతం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తేనే ఆ పార్టీ బతుకుతుందని వంశీ వ్యాఖ్యానించారు. అయితే తమ నాయకుడు చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నారని... తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంశంపై మాట్లాడేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయని టీడీపీ అధినేత చంద్రబాబు... వర్ల రామయ్యతో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించి ఉంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదంతా ఎలా ఉన్నా... తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెకండ్ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించినవేనా అనే ప్రచారం మొదలైంది. ఈ సినిమా గురించి వర్మ బయటకు చెప్పకపోయినా... ఇది టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌గానే తెరకెక్కించారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్లో బుడ్డోడు పార్టీని లాగేసుకోకపోతే అనే డైలాగ్స్ పెట్టారు వర్మ. దీనికి అర్థమేంటని దానిపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. టీడీపీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళుతుందనే ఉద్దేశంతోనే వర్మ ఈ రకమైన డైలాగ్స్ పెట్టారా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

బిగ్‌బాస్ 4 అంతా సిద్ధం.. హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. ?
టెంపర్ రిపీట్..దిశా నిందితుల ఎన్కౌంటర్ పై నెటిజన్ల స్పందన..
జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి మూడు సినిమాలు ఈ దర్శకులతోనే..?
‘RRR’ సినిమాలో సూపర్ సర్ప్రైజ్.. అభిమానులకు రాజమౌళి కానుక..
‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్ ధాటి తట్టుకోలేకపోతున్న రామ్ చరణ్..
ప్రభాస్ చేయాల్సిన స్టోరీతో ఎన్టీఆర్ సినిమా..
Loading...