news18-telugu
Updated: September 4, 2019, 3:58 PM IST
నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్రానాయక్
తనకు చంద్రబాబుపై ఎలాంటి కోపం కాని, వ్యతిరేకత కాని లేదని అన్నారు రేవూరి ప్రకాశ్ రెడ్డి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన రేవూరి ప్రకాశ్ రెడ్డి... రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీని ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారని రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ రోజురోజుకు దిగజారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబే బీజేపీలోకి వలసలు ప్రోత్సహిస్తున్నారనేది అవాస్తవమని రేవూరి అన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోందన్న రేవూరి... కేసీఆర్పై తెలంగాణలో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా... చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఈ సందర్భంగా రేవూరి స్పష్టం చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
September 4, 2019, 3:58 PM IST