కాంగ్రెస్‌కి మరో దెబ్బ... ఆ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారా... సాగుతున్న చర్చలు?

Telangana Congress : ఇప్పటికే సీఎల్పీ విలీనం అంశంతో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న తెలంగాణ కాంగ్రెస్‌పై మరో పిడుగు పడేలా కనిపిస్తోంది. ఇద్దరు కీలక ఎంపీలు... బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 7:29 AM IST
కాంగ్రెస్‌కి మరో దెబ్బ... ఆ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారా... సాగుతున్న చర్చలు?
రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 7:29 AM IST
తెలంగాణలో టార్గెట్ 2024గా పావులు కదుపుతున్న బీజేపీ... ఛాన్స్ ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలుచుకున్నా... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాలు సాధించిన కమలం పార్టీ... 2024లో తెలంగాణలో అధికారం తమదేనని అంటోంది. టీఆర్ఎస్‌కి తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులు.. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా... మునిగిపోయే నావలా మారిన కాంగ్రెస్‌ నుంచీ నేతలు తలో దారీ చూసుకుంటుంటే... అలాంటి వారిని తమవైపు లాక్కునేందుకు కమల దళం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇద్దరు కీలక ఎంపీలను తమవైపు తిప్పుకుంటోందని తెలిసింది.

తెలంగాణ కాంగ్రెస్‌‌కు చెందిన ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డితో... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చర్చలు జరిపినట్లు తెలిసింది. వాళ్లతోపాటూ... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు కూడా రామ్‌మాధవ్‌ను కలిశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ చర్చలేవీ జరగట్లేదనీ, ఇదంతా ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. తెరవెనక మంతనాలు మాత్రం జరుగుతున్నాయనీ... ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... టీఆర్ఎస్‌లో చేరిపోవడం, మరి కొందరు కూడా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం కలగలిపి... జంపింగ్‌లు జోరందుకుంటున్నాయి. ఐతే... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచీ గెలిచింది ముగ్గురు ఎంపీలు. వారిలో ఇద్దరు పార్టీ మారితే... మిగిలింది ఒక్కరే. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోవడం చాలా కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 ఇవి కూడా చదవండి :

భారీగా నకిలీ విత్తనాల పట్టివేత... ఏడుగురికి జైలు...


నటి సోనాక్షికి షాక్... మోసంచేసిన నైజీరియన్...
Loading...
హుజూర్‌నగర్‌లో 100 మంది నామినేషన్ ? సీపీఎస్ రద్దుకు డిమాండ్...
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...