అర్జంట్‌గా ఈ పని చేయండి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానిక మిలటరీ అధికారులు 20కి పైగా రోడ్లను మూసేశారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: September 4, 2020, 2:52 PM IST
అర్జంట్‌గా ఈ పని చేయండి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు రేవంత్ రెడ్డి లేఖ
రేవంత్ రెడ్డి
  • Share this:
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మిలిటరీ అధికారులు మూసేసిన దారులను వెంటనే తెరవాలంటూ కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. కంటోన్మెంట్‌లో రహదారులు మూసివేయడం వల్ల తన నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానిక మిలటరీ అధికారులు 20కి పైగా రోడ్లను మూసేశారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. దానివల్ల కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కంటోన్మెంట్‌లో మూసేసిన రోడ్లను తెరవాలని గతంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంకా తెరవలేదన్నారు. తన నియోజకవర్గం మల్కాజ్‌గిరిలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ కంటోన్మెంట్ మార్గం చాలా ప్రధానమైనదని చెప్పారు. కానీ, వాటిని మూసి ఉంచడం వల్ల తన నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాబట్టి, ప్రజల కష్టాలు తీర్చడానికి వెంటనే సదరు రోడ్లను ఓపెన్ చేయాల్సిందిగా సికింద్రాబాద్‌లోని స్థానిక మిలటరీ అధికారులను ఆదేశించాల్సిందిగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.



గతంలో రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలకు సంబంధించిన పత్రాలను కూడా ఆ లేఖతో పాటు రేవంత్ రెడ్డి జతచేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 4, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading