REVANTH REDDY WIN IN MALKAJGIRI BIG BLOW FOR TRS CHIEF KCR IN TELANGANA AK
కేసీఆర్కు బిగ్ షాక్... మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth reddy wins in malkajgiri | దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి 6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు.
లోక్సభ ఎన్నికలు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ను విమర్శించడంలో అందరికంటే ముందుండే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో విజయం సాధించారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి 6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఫలితాల సరళి కూడా అదే రకంగా వచ్చాయి.
రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య చివరి రౌండ్ వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి రౌండ్ వరకు స్వల్ప అత్యధికను ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డిని అఖరి రౌండ్లో విజయం వరించింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సొంతం చేసుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి విజయం పెద్ద షాక్ ఇచ్చినట్టయ్యింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.