• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • REVANTH REDDY WILL NOT CHANGE FATE OF CONGRESS IN TELANGANA EVEN IF HE GET TPCC PRESIDENT AK

Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి... మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినా తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లనని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేసులో ముందున్నారు. అయితే ఆయనకు ఈ పదవి వస్తుందా ? రాదా ? అనే అంశం ఎటూ తేలడం లేదు. ఏడాదికిపైగా ఈ అంశాన్ని నాన్చుతూ వస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఈ విషయంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన అభిమానులను ఊరిస్తోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అంశంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినా.. ఆయన పార్టీని పైకి తీసుకురాలేరని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ఇందుకు అసలు కారణమని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చినా తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లనని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని... ఇంతో అంతో ఉందంటే తెలంగాణలోనే ఉందని అన్నారు.

    ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో తెలంగాణ టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నాయకత్వం మరోసారి ఫోకస్ పెట్టిందనే ఊహాగానాలు ఇటీవల మొదలయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి అభిమానుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. తమ నాయకుడికి కాంగ్రెస్‌కు సారథ్యం వహించే పదవి దక్కుతుందని వాళ్లు ఆశపడుతున్నారు. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరువాత టీపీసీసీ కొత్త బాస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: