Home /News /politics /

REVANTH REDDY WARNING TO CONGRESS LEADERS REGARDING DIGITAL MEMBERSHIP FOCUS ON 30 LAKHS COMPLETION AK

Telangana Congress: ఆ నేతలకు Revanth Reddy వార్నింగ్.. జనవరి 30 చివరి తేదీ

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: కష్టాల్లో ఉన్న పార్టీ ముందుగా అంతర్గత కలహాలు సమసిపోయేందుకు కృషి చేయాల్సి ఉంటుందని.. కాబట్టి ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది నేతలు భావిస్తూ వచ్చారు.

    తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా.. పార్టీని బలోపేతం చేయడంపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ అంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 30 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ దిశగా పార్టీ నేతలు, శ్రేణులు అంత సీరియస్‌గా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. నేతల మధ్య విభేదాలు, వివాదాలతో పాటు కరోనా ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ డిజిటిల్ సభ్యత్వ కార్యక్రమంపై పడింది. ఇప్పటివరకు కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వంలో కేవలం 8 లక్షల మంది మాత్రమే చేరారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 22 లక్షల సభ్యత్వాలను చేర్పించాల్సి ఉంది. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ఇంఛార్జ్‌, కో ఆర్డినేటర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై అంతగా ఫోకస్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలే కష్టాల్లో ఉన్న పార్టీ ముందుగా అంతర్గత కలహాలు సమసిపోయేందుకు కృషి చేయాల్సి ఉంటుందని.. కాబట్టి ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది నేతలు భావిస్తూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాట ఇచ్చిన విధంగా ఈ నెలాఖరు నాటికి 30 లక్షల సభ్యత్వాలు పూర్తి చేయాల్సిందే అని నేతలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేతలకు సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై ఇంఛార్జ్‌లు దృష్టి పెట్టాలన్న రేవంత్ రెడ్డి.. పార్టీ కోసం కష్టపడని నేతలపై వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో.. ఎవరో షో చేస్తున్నారో తనకు పూర్తిగా తెలుసు అని కామెంట్ చేశారు.

    ఇందుకు సంబంధించి అన్ని నివేదికలు తన దగ్గర ఉన్నాయని వారికి వివరించారు. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తాను సహించబోనని స్పష్టం చేశారు. దీంతో డిజిటల్ సభ్యత్వాల విషయంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఏ మేరకు పని చేస్తుందనే విషయం తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే అని కొందరు భావిస్తున్నారు.

    JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లారు ?.. తెరవెనుక స్టోరీ ఏంటి ?

    KCR: ఆ నాయకుడి విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?.. అవన్నీ కలిసొచ్చాయా ?

    డిజిటల్ సభ్యత్వాల నమోదు విషయంలో ఏయే నియోజకవర్గం, జిల్లా నేతలు ఏ మేరకు పని చేస్తున్నారనే దానిపై టీపీసీసీ నివేదికలు రూపొందిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇచ్చిన సభ్యత్వాల నమోదు టార్గెట్‌ను పూర్తి చేయడం ద్వారా పార్టీ బలోపేతం కూడా సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తోందని.. అందుకే ఈ అంశంపై అంతగా దృష్టి పెడుతోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పార్టీలోని విభేదాలు, వివాదాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి.. సభ్యత్వాల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు