Home /News /politics /

REVANTH REDDY TRYING HARD TO ATTRACT TRS SENIOR LEADER EX MINISTER TUMMALA NAGESHWAR INTO CONGRESS AK

Telangana: రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. టీఆర్ఎస్ కీలక నేతపై ఫోకస్.. వర్కవుట్ అవుతుందా ?

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్‌లో తన వర్గానికి అంతగా గుర్తింపు లభించడం లేదని తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారని.. ఈ కారణంగానే చాలాకాలం నుంచి ఆయన పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నా తనదైన పంథాలో కాంగ్రెస్ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పాలేరు నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో.. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు నియోజకవర్గంతో పాటు జిల్లాలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    టీఆర్ఎస్‌లో తన వర్గానికి అంతగా గుర్తింపు లభించడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారని.. ఈ కారణంగానే చాలాకాలం నుంచి ఆయన పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తుమ్మలను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందనే టాక్ జోరందుకుంది. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో.. పాలేరులో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరమనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించారని.. ఇందుకోసం తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన దృష్టి పెట్టారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

    పాలేరుపై ప్రత్యేక దృష్టి
    రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపితే బాగుంటుందనే యోచనలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తోందని సమాచారం. జిల్లావ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి తీసుకురావడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ అనుబంధంతోనే ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

    Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ మారిందా ?.. చివరి నిమిషంలో కొత్త ప్రతిపాదన

    Blood Improving Food: శరీరంలో రక్తం తక్కువగా ఉందా ?.. వీటిని తింటే చాలు..

    అయితే రెండు మూడు దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు.. టీఆర్ఎస్‌లో చేరేందుకే ఎంతో ఆలోచించారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికి వచ్చి చర్చలు జరపడంతో పాటు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇవ్వడంతో గులాబీ గూటికి చేరారు. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు.. మరోసారి పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తుమ్మల కాకపోయినా ఆయన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. పరోక్షంగా ఆయన మద్దతు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth reddy, Telangana, Tummala nageshwara rao

    తదుపరి వార్తలు