రేవంత్ రెడ్డి ఫ్యూచర్... అంతా ఆయన చేతుల్లోనే...

రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్‌ నేపథ్యం ఉందని... కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరిగింది. తాజాగా ఇదే అంశాన్ని పరోక్షంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకొచ్చారని సమాచారం.

news18-telugu
Updated: November 6, 2019, 6:32 PM IST
రేవంత్ రెడ్డి ఫ్యూచర్... అంతా ఆయన చేతుల్లోనే...
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత ఆ పదవి తనకే ఇవ్వాలని ఆయన ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు కూడా జరిపినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్‌ నేపథ్యం ఉందని... కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరిగింది. తాజాగా ఇదే అంశాన్ని పరోక్షంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకొచ్చారని సమాచారం.

తాను కూడా టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని ఇప్పటికే స్పష్టం చేసిన వీహెచ్... తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఇటీవల ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ పదవిపై ఉన్న కోరికను ఏ మాత్రం దాచుకోవడం లేదు. తనకు ఓ అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌ను అభ్యర్థించారు.

ఈ నేపథ్యంలోనే గులాం నబీ ఆజాద్ ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తారనే దానిపైనే రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందా లేదా అనే విషయం తేలిపోతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో టీ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే రేవంత్ రెడ్డి పార్టీలో ఉండటం అనుమానమే అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సెలైంట్‌గా హైదరాబాద్ వచ్చి వెళ్లిపోయిన గులాం నబీ ఆజాద్... కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ డిసైడ్ చేస్తారేమో చూడాలిFirst published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు