రేవంత్ రెడ్డి రివర్స్ ఎటాక్... ఆయనతోనే మొదలు ?

జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి... తన ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: March 19, 2020, 7:06 AM IST
రేవంత్ రెడ్డి రివర్స్ ఎటాక్... ఆయనతోనే మొదలు ?
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రాజకీయంగా కొత్త సవాల్ విసిరారనే చెప్పాలి. మరి.. తనదైన వ్యహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే కేసీఆర్.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తుగడను ఏ రకంగా తిప్పుకొడతారన్నది ఆసక్తికరంగా మారింది.
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి... ఆ పార్టీ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా ? తన ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ? కాంగ్రెస్‌లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించాల్సిందని రేవంత్ రెడ్డి తన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ ముట్టడికి ఉత్తమ్ పిలుపునిచ్చి ఉంటే కార్యకర్తలు ఇంకా ఉత్తేజంతో పనిచేసి ఉండేవారని కామెంట్ చేశారు. తాను చర్లపల్లి జైల్లో ఉంటే ఉత్తమ్‌ పరామర్శకు రాలేదని, అక్కడి ఖైదీలు తనను ఇదే విషయం అడిగారని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో నేతలు సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా పోరాటం చేయడం లేదన్న అపోహ ప్రజల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి కేసీఆర్‌ బలవంతుడేమీ కాదని, తామందరం కలిసికట్టుగా లేకపోవడమే ఆయన బలమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అవినీతిపై పోరాటంలో భాగంగా భూలావాదేవీలకు సంబంధించి కార్యాచరణ బాధ్యత తనకు, సాగునీటి రంగంలో దోపిడీపై కార్యాచరణ బాధ్యత ఉత్తమ్‌కు కుంతియా అప్పగించారని చెప్పారు.

నేటి నుంచి టీఆర్‌ఎస్‌ దోపిడీ వివరాలను కాగితాల రూపంలో విడుదల చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కరోనా అయితే టీఆర్ఎస్ ఎయిడ్స్ లాంటి పార్టీ అని మండిపడ్డారు. అయితే కేసీఆర్‌, కేటీఆర్‌కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో మద్దతు ప్రకటించకపోవడం వల్లే రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు ? రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కౌంటర్ ఇస్తారా ? అనే చర్చ కూడా మొదలైంది.
Published by: Kishore Akkaladevi
First published: March 19, 2020, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading