కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను మా అక్కను గెలిపించుకుంటా : రేవంత్

కోర్టులతో కేసీఆర్ ఆటలాడితే మొట్టికాయలు తప్పవని.. ఆయన వైఖరితో టీఆర్ఎస్‌లోని తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: October 19, 2019, 4:57 PM IST
కేటీఆర్ కవితను గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను మా అక్కను గెలిపించుకుంటా : రేవంత్
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
కేటీఆర్ నిజామాబాద్‌లో వాళ్ళ చెల్లెను గెలిపించుకోలేకపోయాడని.. తాను మాత్రం హుజూర్ నగర్‌లో తన అక్క పద్మావతి రెడ్డిని గెలిపించుకుంటానని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరాకాష్ఠకు చేరుకుందని.. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంద్‌కు కేసీఆరే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రుల బాధ్యతారాహిత్య వ్యాఖ్యలే కార్మికుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను కేసీఆర్ ఇంధనంగా వాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏనాడు చెప్పలేదంటున్నారని.. మరి ఆర్టీసీని సగం ప్రైవేట్ చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అని గుర్తుచేస్తున్నారు.కోర్టులతో కేసీఆర్ ఆటలాడితే మొట్టికాయలు తప్పవని.. ఆయన వైఖరితో టీఆర్ఎస్‌లోని తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. సమ్మెపై వారు ఏమీ మాట్లాడకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఎర్రబస్సుకు 27శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఎయిర్ బస్సుకు 1శాతం పన్ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. రూ.85వేల కోట్ల విలువ చేసే ఆర్టీసీ ఆస్తుల కేసీఆర్ కన్ను పడిందని.. వాటిని తన తాబేదార్లకు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ అనే అధికారం కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక.. రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కేసీఆర్ సాధించింది రాష్ట్రానికి రూ.2.5లక్షల కోట్ల అప్పు,మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లడమన్నారు. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించేది హుజూర్‌నగర్ ఉపఎన్నికయే అని..కేసీఆర్ నియంత్రుత్వాన్ని అణచివేయాలంటే.. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌ను ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

 

 
Published by: Srinivas Mittapalli
First published: October 19, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading