Telangana: కేసీఆర్ ఆ పని చేయలేదు.. వారిపై ఇంకా కేసులు.. మండిపడ్డ రేవంత్ రెడ్డి

Revanth reddy

Revanth Reddy: టీఆర్ఎస్ నేతలపై ఉద్యమ కేసులు కొట్టివేయించుకున్నారని.. కానీ విద్యార్థులు, ఉద్యమకారులపై మాత్రం కేసులు కొట్టివేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
    పార్టీ నిర్మాణం, ఉద్యమ సమయంలో అండగా ఉన్న ఏ ఒక్కరినీ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ స్మరించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. . ఎంతో మంది సమాధుల మీద టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. చట్టం, రాజకీయ నీతి లేకుండా భాగ్యనగరాన్ని గులాబీమయంగా మార్చారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని కేసీఆర్ (CM KCR) అనడాన్ని తప్పుబట్టారు. ఏడున్నరేళ్ల పాలనపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుటుంబమే రాష్ట్రం సాధించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ (TRS) 20 ఏళ్ల ప్రస్థానం జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా మారిందని విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులపై చర్చకు సిద్ధమా ? అని మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

    ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రభుత్వానికి నివేదిక వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలపై ఉద్యమ కేసులు కొట్టివేయించుకున్నారని.. కానీ విద్యార్థులు, ఉద్యమకారులపై మాత్రం కేసులు కొట్టివేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

    After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

    రేవంత్ రెడ్డికి డీజీపీ కౌంటర్
    హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఎవరి ఫోన్‌లు ట్యాప్‌ చేయట్లేదని వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లపై రేవంత్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మహేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని.. ఈ విషయంలో రాజీపడబోమని అన్నారు. పోలీస్‌ శాఖలో గ్రూపులు లేవని, అసత్య ప్రచారంలో మమల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: