Home /News /politics /

REVANTH REDDY SILENT SHOCK TO YS SHARMILA PARTY IN TELANGANA HERE IS THE DETAILS AK

YS Sharmila: వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తెరవెనుక జరిగింది ఇదే..

రేవంత్ రెడ్డి, షర్మిల (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila Revanth Reddy: ఇందిరా శోభన్ షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం దాగి ఉందనే చర్చ జరుగుతోంది.

    రాజకీయాల్లో తాము రాణించడంతో పాటు తమ ప్రత్యర్థులను దెబ్బకొట్టడం ఎలా అనే అంశంపై నేతలు దృష్టిపెడుతుంటారు. ఇందుకోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంటారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి(Revanth Reddy)  కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో రాజకీయ పోరాటం చేసేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి.. తమ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్న షర్మిల (YS Sharmila)  పార్టీపై కూడా కన్నేశారనే టాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే రెడ్డి, దళిత క్రైస్తవులను షర్మిల తన వైపు తిప్పుకుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఆమె పార్టీ బలపడితే.. ఆ ప్రభావం మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా కాంగ్రెస్‌పైనే ఉంటుందనే విషయాన్ని గ్రహించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. షర్మిల పార్టీని ఆదిలోనే దెబ్బకొట్టేందుకు తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇటీవల షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇందిరా శోభన్ (Indira Shoban) .. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోచేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. షర్మిల పార్టీలో గుర్తింపు ఉన్న నేతగా పేరు తెచ్చుకున్న ఇందిరా శోభన్.. అంత హఠాత్తుగా ఆ పార్టీ నుంచి బయటకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

    అసలే వలసలు లేని తమ పార్టీ నుంచి ఇందిరా శోభన్ వంటి వాళ్లు వెళ్లిపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న షర్మిల.. ఆమెకు ఫోన్ చేసిన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇందిరా శోభన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే ఇందిరా శోభన్ షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం దాగి ఉందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సన్నిహితురాలైన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడటం వల్లే ఇందిరా శోభన్ షర్మిల పార్టీకి హ్యాండ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.

    Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

    కాంగ్రెస్ పార్టీలో ఇందిరా శోభన్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తామని సీతక్క ద్వారా రేవంత్ రెడ్డి చెప్పించారని.. ఈ కారణంగానే ఆమె షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు షర్మిల ఎక్కువగా దృష్టి పెట్టిన ఖమ్మం జిల్లాపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని.. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు షర్మిల పార్టీ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి షర్మిల పార్టీ నుంచి ముఖ్యనేతలు బయటకు వెళ్లడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉండి ఉంటే.. భవిష్యత్తులో ఆమె పార్టీ నుంచి మరికొందరిని కూడా రేవంత్ అండ్ టీమ్ కాంగ్రెస్ వైపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth reddy, Telangana, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు