టీఆర్ఎస్‌కు ఊహించని షాకిచ్చిన రేవంత్ రెడ్డి

మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ వచ్చిన దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం... టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిణామమని పలువురు చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: January 10, 2020, 12:12 PM IST
టీఆర్ఎస్‌కు ఊహించని షాకిచ్చిన రేవంత్ రెడ్డి
కేటీఆర్, రేవంత్ రెడ్డి
  • Share this:
మున్సిపాలిటి, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మరోసారి తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి... ఆ పార్టీ రెబల్ నేతకు కాంగ్రెస్ కండువా కప్పారు. మల్కాజ్ గిరి పరిధిలోకి వచ్చే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఆశించారు దర్గ దయాకర్ రెడ్డి. అయితే ఇందుకు టీఆర్ఎస్ నాయకత్వం అంగీకరించలేదు. దీంతో ఆయన టీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి... స్వయంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు స్వయంగా దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కోరారు. ఆయనకు కాంగ్రెస్ తరపున బీ ఫామ్ కూడా ఇచ్చారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయంలో దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ వచ్చిన దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం... టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిణామమని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మేడ్చల్ పరిధిలోని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మల్లారెడ్డికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ స్టేజ్ మీదే వాగ్వాదం చేసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దయాకర్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం... ఈ పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకోవడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: January 10, 2020, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading