వారి వల్లే విజయారెడ్డి హత్య... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయారెడ్డి, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)

తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    విజయారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే విజయారెడ్డి హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయారెడ్డి భౌతికకయానికి కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.
    First published: