రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... నల్లమల జోలికి వస్తే...

నల్లమలలో యురేనియం తవ్వకాలు జరగకుండా అడ్డుకోవాలని స్థానికులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు.

news18-telugu
Updated: August 17, 2019, 3:29 PM IST
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... నల్లమల జోలికి వస్తే...
రేవంత్ రెడ్డి, నల్లమల అడవి
  • Share this:
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చేవారి గుండెల్లో గునపం దింపుతామని హెచ్చరించారు. ఆమ్రాబాద్‌ మండలంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి... యురేనియం తవ్వకాల కారణంగా ఈ ప్రాంతమంతా కలుషితమైపోతుందని అన్నారు. అదే జరిగితే ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కూడా నల్లమల్ల బిడ్డనే అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి... యురేనియం తవ్వకాలను అడ్డుకోలేకపోయారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై విరుచుకుపడ్డారు.

ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. యురేనియం తవ్వకాలకు సహకరిస్తున్న.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను నల్లమలలో సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కేసీఆర్‌ హామీ ఇచ్చేవరకు పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. యురేనియం అంటూ ఎవరైనా వస్తే వారికి చెట్టుకు కట్టేయాలన్నారు. ఇక్కడి ప్రజల పోరాటానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.


First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు