Revanth Reddy: ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. షాక్ ఇచ్చిన హైకమాండ్.. తెరవెనుక కీలక నేత

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా.. ఉత్తమ్ మాత్రం పార్టీ వేదికల మీదే రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు రాష్ట్రంలోని పరిస్థితులపై వివరణ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. అయితే ఇదే సమయంలో అధిష్టానం పెద్దలు ఓ విషయంపై ఆయనను వివరణ కోరినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో ఆయన అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి అనుబంధంగా నియోజకవర్గాల వారీగా కొందరు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్యనేత సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఆయన మరెవరో కాదు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).

    రేవంత్ ప్రజా దర్బార్‌ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్‌ విషయాన్ని ఆయన ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. టీపీసీసీ చీఫ్ అయిన తరువాత కూడా ఇలాంటి ప్రచారం ఎందుకని ఆయన కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ (congress) పెద్దలు కూడా సీరియస్‌గానే తీసుకుని.. ఇలా ఎందుకు జరుగుతోందని రేవంత్ రెడ్డి వివరణ కోరినట్టు తెలుస్తోంది.

    అయితే ఈ విషయం అధిష్టానం వరకు ఎలా వెళ్లిందని ఆరా తీసిన రేవంత్ రెడ్డి.. దీని వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని తెలుసుకున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఉత్తమ్‌ను కలిసి దీనిపై వివరణ ఇచ్చారనే చర్చ కూడా సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీప్ అయిన తరువాత ఆయనకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య సఖ్యత లేదనే ప్రచారం సాగుతోంది.

    Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్

    Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా.. ఉత్తమ్ మాత్రం పార్టీ వేదికల మీదే రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టేలా ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో దూసుకుపోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి అనుకోని అనుభవాలు ఎదురవుతున్నాయనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: