రేవంత్ రెడ్డి పంతం నెగ్గలేదా... కాంగ్రెస్ పట్టించుకోలేదా ?

Revanth reddy | హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారా ? లేక ప్రచారానికి దూరంగా ఉంటారా ? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

news18-telugu
Updated: September 24, 2019, 5:36 PM IST
రేవంత్ రెడ్డి పంతం నెగ్గలేదా... కాంగ్రెస్ పట్టించుకోలేదా ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 24, 2019, 5:36 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఖరారవుతున్నారు. టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ తరపున శ్రీకళారెడ్డి, కాంగ్రెస్ తరపున పద్మావతి పోటీలో ఉండబోతున్నారు. అన్ని పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా... తమ సిట్టింగ్ సీటును నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతికి సీటు ఇప్పించుకున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్... టీఆర్ఎస్‌ను తట్టుకుని కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అన్న అంశంపైనే తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ విషయంలో ఉత్తమ్‌తో విభేదించిన మరో కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారనే అంశం ఆసక్తిరేపుతోంది. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున తన భార్య పోటీ చేస్తారని ఉత్తమ్ ప్రకటించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం హుజూర్ నగర్‌లో పద్మావతికే టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన పద్మావతి గెలుపు కోసం ఎంత మేరకు కృషి చేస్తారనే అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారా ? లేక ప్రచారానికి దూరంగా ఉంటారా ? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి పద్మావతి తరపున ప్రచారం చేయకపోతే... పార్టీలో అది వేరే రకమైన సంకేతాలను పంపుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది.First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...