Home /News /politics /

REVANTH REDDY PLAN TO SILENT CONGRESS SENIOR LEADER V HANUMANTHA RAO GOT SUCCESS AK

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్.. సైలెంట్ అయిన సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో చర్చ

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: తన పేరు చెబితేనే ఫైర్ అయ్యే వీహెచ్‌ను కూల్ చేయడంలో రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అయ్యిందనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది.

    రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇతర పార్టీల నేతలు ప్రత్యర్థులతో పోరాటంపైనే దృష్టి పెడితే సరిపోతుంది. కానీ కాంగ్రెస్‌లో పరిస్థితి భిన్నం. సొంత పార్టీ నేతలపై పైచేయి సాధిస్తూనే ప్రత్యర్థి పార్టీలపై రాజకీయంగా పోరాడాల్సి ఉంటుంది. టీపీసీసీ చీప్‌గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఓ వైపు కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతల నుంచి సహకారం లభించకపోయినా.. తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు రేవంత్. పార్టీలోని నేతలకు కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి ఇప్పటికే కూల్ చేశారనే చర్చ జరుగుతోంది. అలాంటి వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఉన్నారని గాంధీ భవన్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    నిజానికి రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం వీహెచ్‌కు మొదటి నుంచి ఇష్టంలేదు. ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు కూడా. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు మీడియా ముందే వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికే టీపీసీసీ చీప్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అనుచరులు, అభిమానులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పలుసార్లు ఆరోపించారు. అయితే వీహెచ్ మాటలను పట్టించుకోని కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీప్ పదవి ఇచ్చింది. దీంతో ఆయన మరోసారి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారేమో అని చాలామంది భావించారు. కానీ వీహెచ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

    Telangana assembly elections 2018 | telangana congress leader v hanmanthrao allegations on trs over the bc issue | బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ కుట్ర: వీహెచ్
    కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైల్ ఫోటో(Image:Facebook)


    రేవంత్ రెడ్డి విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇదెలా జరిగిందని ఆరా తీస్తే.. వీహెచ్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. తాను టీపీసీసీ చీప్‌ అయిన వెంటనే రేవంత్ రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌ను స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన మద్దతు కోరారు. ఆ తరువాత కూడా ఆయనతో మాట్లాడారు. సీనియర్ నేతగా సూచనలు, సలహాలు స్వీకరిస్తామని వీహెచ్‌కు హామీ ఇచ్చారు.

    Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి

    Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

    పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పార్టీ తరపున తీర్మానం చేస్తామని వీహెచ్‌కు తెలిపారట రేవంత్ రెడ్డి. దీంతో వీహెచ్ కూల్ అయ్యారని.. తనకు ఈ స్థాయిలో గౌరవం ఇస్తున్న రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని డిసైడయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తన పేరు చెబితేనే ఫైర్ అయ్యే వీహెచ్‌ను కూల్ చేయడంలో రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అయ్యిందనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు