అటు నుంచి నరుక్కొస్తున్న రేవంత్ రెడ్డి... సరికొత్త వ్యూహం

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 12, 2019, 4:03 PM IST
అటు నుంచి నరుక్కొస్తున్న రేవంత్ రెడ్డి... సరికొత్త వ్యూహం
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్‌లో మిగతా వారికంటే ప్రజాదరణ పొందిన నేతగా రేవంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ఇమేజ్‌తో పాటు కేసీఆర్‌కు బలమైన వ్యతిరేకి అనే అంశం రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. ఈ కారణంగానే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు సొంతం చేసుకుని... కేసీఆర్‌పై రాజకీయ యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే టీ పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి అనేక ఇబ్బందులు ఉన్నాయని... కొందరు సీనియర్ నేతలు ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వీహెచ్ వంటి వాళ్లు రేవంత్ రెడ్డి వంటి వారికి పీసీసీ చీఫ్ పదవి ఎలా ఇస్తారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లోని పలువురు నేతలు తనకు టీ పీసీసీ చీఫ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని గుర్తించిన రేవంత్ రెడ్డి... కొందరు సీనియర్ నేతలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్‌లో టాక్ వినిపిస్తోంది. జానారెడ్డి, దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్లు తనకు మద్దతుగా ఉండేలా ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని సమాచారం.

మొన్నీమధ్య మల్కాజ్ గిరి ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రారంభోత్సవానికి పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. వారంతా రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ దక్కే విషయంలో తమ మద్దతు ఇచ్చినట్టే అని కాంగ్రెస్‌లోని ఓ వర్గం భావిస్తోంది. తన టార్గెట్ అయిన టీపీసీసీ చీఫ్ పదవి దక్కించుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ఈ రకమైన ప్లాన్ వేశారనే టాక్ వినిపిస్తోంది.First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>