రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్... ఈసారి సక్సెస్ అవుతారా ?

Revanth reddy: తెలంగాణలో టీఆర్ఎస్‌తో పోరాడేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 21, 2019, 3:08 PM IST
రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్... ఈసారి సక్సెస్ అవుతారా ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో టీఆర్ఎస్ పేరు చెబితేనే ఓ రేంజ్‌లో విరుచుకుపడే రేవంత్ రెడ్డి... ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసిన ఆరు నెలల్లోనే ఎంపీగా గెలిచి సత్తా చాటారు. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి... బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా ఉంది. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన రేవంత్... లేటెస్ట్‌గా కొత్త టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి... తన నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుపై ఫోకస్ చేశారు. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏ రకంగా గెలిపించాలనే దానిపై అప్పుడే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనన్నీ ఎక్కువ డివిజన్లలో గెలిచేలా చేయాలని భావిస్తున్న రేవంత్... ఇందుకోసం అప్పుడే క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ గెలుపు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఏ డివిజన్‌లో మీటింగ్ పెట్టినా తాను వస్తానని వారికి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా... ఆ తరువాత జరగబోయే జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపించి పార్టీపై తన పట్టు పెంచుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు