కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కాక... అసలేం జరుగుతోంది ?

రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్’తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.

news18-telugu
Updated: September 20, 2019, 11:38 AM IST
కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కాక... అసలేం జరుగుతోంది ?
రేవంత్ రెడ్డి (File)
news18-telugu
Updated: September 20, 2019, 11:38 AM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదుగుతాడని భావించిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు ఆ పార్టీలోనే కొత్త వివాదానికి తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఏకంగా టీ పీసీసీ ఉత్తమ్‌ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఉత్తమ్‌ను మాత్రమే కాదు... కాంగ్రెస్‌లోని పలువురు ఇతర నేతలను కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసినట్టుగా మాట్లాటడం ఆ పార్టీలో కాక పుట్టిస్తోంది. ఇక ఉత్తమ్‌కు సపోర్ట్‌గా ఆయనను ఎఫ్పుడూ విమర్శించే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెరపైకి రావడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.

ఉత్తమ్‌కు మద్దతుగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం. దీంతో కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఒంటరి అవుతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలతో పాటు వంశీచంద్ రెడ్డి, సంపత్ వంటి జూనియర్లు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయాలన్నీ ఆయన వ్యూహంలో భాగమే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

టీ పీసీసీ చీఫ్ పదవి తనకు రాకుండా చేసిన వారిపై పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టారని... టీ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కొనసాగే అవకాశం కూడా తక్కువే అనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కారణంగా చెలరేగిన కొత్త వివాదం... ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...