రేవంత్ రెడ్డి తీస్‌మార్ ఖాన్ కాదు... కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం...

‘నువ్వు మగాడివే కదా. తీస్ మార్ ఖాన్ కదా. నువ్వు టీడీపీలో ఉండి మగాడివి అని ఎందుకు అనిపించుకోలేదు?’ అని జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: March 12, 2020, 7:59 PM IST
రేవంత్ రెడ్డి తీస్‌మార్ ఖాన్ కాదు... కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం...
రేవంత్ రెడ్డి (File)
  • Share this:
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్ బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదు.’ అని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అని, పీసీసీ అధ్యక్షుడు అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి అంత తీస్‌మార్ ఖాన్ కాదు. అంత తీస్ మార్ ఖాన్ అయితే, టీడీపీలో ఉండే ఎందుకు చేసుకోలేడు?.’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘నువ్వు మగాడివే కదా. తీస్ మార్ ఖాన్ కదా. నువ్వు టీడీపీలో ఉండి మగాడివి అని ఎందుకు అనిపించుకోలేదు? నిన్ను అడిగేవారు లేక ఇదంతా చేస్తున్నారా? ఎలా కనపడుతున్నాం’ అని జగ్గారెడ్డి నిలదీశారు. తనకు కూడా సీఎం కావాలని, పీసీసీ అధ్యక్షుడు కావాలని ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సీఎం కావాలని ఉందని, అయితే, అది డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నారు.

రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్‌బుక్‌లో దుష్ప్రచారాన్ని ఆపకపోతే నేను నేరుగా ఢిల్లీకి వెళ్తా. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలసి ఈ తమాషా, నాటకం అంతా చెబుతా. రేవంత్‌ను తక్షణమనే పక్కనపెట్టండి. మాకు దమ్ముంది. పార్టీని ఎలా పైకి తేవాలో మాకు తెలుసు. హీరో హీరో అనే రేవంత్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు. నన్ను కూడా పులి, పులి అనేవారు. కేవలం 2వేల ఓట్లతో గెలిచా. ఫీల్డ్‌లో చుక్కలు కనిపిస్తున్నాయి. డబ్బు లేందే రాజకీయం నడవదు.

జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే


ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన మీద కూడా కేసులు పెట్టారని జగ్గారెడ్డి చెప్పారు. అయితే, ఆ విషయాన్ని పార్టీకి చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు రాజనీతిలో మామూలేనన్నారు. అమీన్ పూర్ అసైన్‌మెంట్ భూముల విషయంలో కూడా తాను తెలియక సంతకం పెట్టానని, తనను కూడా ప్రభుత్వం ఎప్పుడు జైల్లో పెడుతుందో తెలియదన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రచారంతోనే రేవంత్ రెడ్డి కొంపముంచుతున్నారని అనుచరులకు హితవు పలికారు. ప్రభుత్వం మీద పోరాటం, కేసీఆర్‌కు వ్యతిరేక పోరాటం పక్కదారి పట్టి సొంత ఎజెండా ముందుకొచ్చిందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 12, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading