Revanth Reddy: కొడంగల్‌కు గుడ్ ‌బై చెప్పే యోచనలో రేవంత్ రెడ్డి ?

మల్కాజ్ గిరి నుంచి కొత్త ఇన్నింగ్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... కొడంగల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది.

news18-telugu
Updated: February 20, 2020, 12:36 PM IST
Revanth Reddy: కొడంగల్‌కు గుడ్ ‌బై చెప్పే యోచనలో రేవంత్ రెడ్డి ?
రేవంత్ రెడ్డి (File)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన రెండుసార్లు గెలుపొందిన కొడంగల్ నియోజకవర్గానికి సైతం రేవంత్ రెడ్డి కారణంగానే పాపులారిటీ బాగా పెరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి... ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయినా తనను పొలిటికల్ హీరోను చేసిన కొడంగల్‌ను మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఎన్నిక ఏదైనా... కొడంగల్‌లో ప్రచారం చేశారు. మళ్లీ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తాజాగా కొడంగల్ విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచన మారిందనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా కొడంగల్‌ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుండటంతో... రేవంత్ రెడ్డి కొడంగల్‌ను వదిలేసి కొత్త నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొడంగల్ నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలిపెట్టి మల్కాజ్ గిరి పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజవకర్గాన్ని ఎంపిక చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇందుకోసం ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాలను ఆయన పరిశీలిస్తున్నారని సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డికి ఈ రెండు నియోజకవర్గాల్లో మంచి మెజార్టీ లభించింది. దీంతో ఆయన కొడంగల్ నుంచి గ్రేటర్‌కు షిఫ్ట్ అవుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి మల్కాజ్ గిరి నుంచి కొత్త ఇన్నింగ్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... కొడంగల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.



First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు