రేవంత్ రెడ్డి తీరు మారుతోందా... సరికొత్త వ్యూహమా ?

హుజూర్ నగర్‌లో ఉత్తమ్ సతీమణి పద్మావతికి బదులుగా తన వర్గం నాయకుడికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగడంతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు.

news18-telugu
Updated: October 22, 2019, 5:56 PM IST
రేవంత్ రెడ్డి తీరు మారుతోందా... సరికొత్త వ్యూహమా ?
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్ పార్టీలో ఎదగాలంటే ముందుగా అందులో ఉండే రాజకీయాలను ఎదుర్కోవాలి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా ఉండే నేతలకు బాగా తెలుసు. అయితే కాంగ్రెస్ రాజకీయాలను అంత తొందరగా ఒంటబట్టించుకోలేకపోయిన టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి... సొంత పార్టీలో విభేదాల కారణంగా తాను అనుకున్న పదవి సాధించలేకపోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డికి... ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అడ్డుపడుతున్నారనే వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా వారిపై తన మార్కు రాజకీయాలు ప్రయోగించాలని చూశారు. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ సతీమణి పద్మావతికి బదులుగా తన వర్గం నాయకుడికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగడంతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను వ్యతిరేకించిన పద్మావతి తరపున హుజూర్ నగర్‌లో ప్రచారం నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.

హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే అంశం పక్కనపెడితే... అక్కడ రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన రావడం కాంగ్రెస్ శ్రేణులకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డికి కచ్చితంగా కలిసొచ్చే అంశమే అని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్‌లో ఎదిగేందుకు ఆ పార్టీ మార్క్ రాజకీయాలను అలవాటు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి తీరు మార్చుకున్నారా ? లేక సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading