Revanth reddy : ప్రజల వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కలిసి గూడుపుఠాని చేస్తున్నాయని కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అరెస్ట్ తర్వాత అంబర్పేట్ పోలీసుస్టేషన్లో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
వరి ధాన్యం పండించే రైతులకు కేంద్రంలో మోడి ప్రభుత్వం, రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వాలు కలిసి ఉరిశిక్ష విధించారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గత మూడు నెలలుగా ధాన్యం కొనుగోలుప జరుగుతున్న పరిణామాల్లో అనేక మంది రైతులు చావులకు కారణమయ్యారని అన్నారు. దీంతో రైతులు తిరగబడంతో పాటు ప్రభుత్వాలనై ఒత్తిడి పెరిగిందని అన్నారు.. ఇలాంటీ పరిస్థితుల్లోనే ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధి నాటకాలకు తెరతీశారని అన్నారు. రైతుల కష్టాలను తీర్చేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసిఆర్ రైతుల కష్టాలను తీర్చేందుకు ఏ ఒక్క ప్రయత్నం చేయాలేదని అన్నారు. మరోవైపు ఉత్త చేతులతో హైదరాబాద్కు తిరిగి వచ్చిన సీఎం మరోసారి మంత్రలను పంపి రాజకీయా డ్రామాలు చేశారని అన్నారు. ఈ క్రమంలోనే అటు టీఆర్ఎస్ మంత్రులు ఇటు బీజేపీ నేతలు సైతం రైతుల ధాన్యం కొనుగోలు చేయిస్తామని ప్రగల్బాలు పలికారని అన్నారు.
కాగా బీజేపీ నేతలు కేంద్రం చేత ధాన్యం కొనుగోలు చేయిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలును పక్కన బెట్టి నిరుద్యోగాల భర్తి అంటూ దీక్షలు చేస్తున్నారని అని మండిపడ్డారు. ఇక నిరుద్యోగ సమస్య అనేది ఇప్పటిది కాదని అన్నారు. కాగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడి యువకులను మోసం చేశారని మండిపడ్డారు. ఇలా రెండు పార్టీలు రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు కలిసే వీధినాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
మరోవైపు రాష్ట్ర రైతాంగాన్ని ధాన్యం పండించవద్దని చెప్పిన సీఎం కేసిఆర్ తన ఎర్రవెల్లి ఫాంహౌజ్లోని 150 ఎకరాల్లో మాత్రం వరి ధాన్యం పండిస్తున్నారని అన్నారు. అయితే రైతులను పండించవద్దని చెప్పిన సన్నాసి తాను ఎందుకు వరిని పండిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వారు రైతుల ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని ఆయన ప్రశ్నించారు. ఇలా వరి వేస్తే రైతులు ఉరి వేసుకున్నట్టే అంటూ వారిపై ఒత్తడి తీసుకురావడంతో పాటు అధికారులతో పాటు ప్రకటనలు చేయించారని అన్నారు. ఇందులో భాగంగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలని అన్నారు. ఇలా రైతులను వద్దని చెప్పిన సీఎం ఎందుకు వరి పండిస్తున్నాడో చెప్పాలని ప్రశ్నిస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించి తెలంగాణా రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.