REVANTH REDDY FAMILY MEETS CONGRESS CHIEF SONIA GANDHI AK
కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి
కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి
తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి... గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మారుతున్నారని రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి .. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై ఆమెతో చర్చించినట్టు తెలుస్తోంది. తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి... గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మారుతున్నారని రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరిగితే... టీపీసీసీ రేసులో అందరికంటే ముందున్నది రేవంత్ రెడ్డి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకుముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న శాఖలు, గతంలో కేటీఆర్ దగ్గర ఉన్న ఐటీ శాఖలు దారుణంగా ఫెయిలయ్యాయని కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన తాజాగా నివేదికలో కేసీఆర్ దగ్గర ఉన్న సాగునీటి, విద్యుత్ శాఖలకు 8, 11 ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖకు 18 ర్యాంకు వచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నివేదికను బట్టి పరిపాలన విషయంలో సీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ పూర్తిగా ఫెయిలయ్యారని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.