రేవంత్ రెడ్డి ఆశలకు బ్రేక్... కారణం అదే ?

టీ పీసీసీ చీఫ్‌ పదవికి కొత్త వారిని ఎంపిక చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 5:52 PM IST
రేవంత్ రెడ్డి ఆశలకు బ్రేక్... కారణం అదే ?
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం టీ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్... అధిష్టానం కొత్తవారిని ఎంపిక చేస్తే ఆ బాధ్యతలను వారికి ఇచ్చి బరువు దింపుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా పలుసార్లు చెప్పినట్టు వార్తలు వినిపించాయి. ఇక టీ పీసీసీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు వీహెచ్ వంటి సీనియర్ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే కొత్త టీ పీసీసీ బాస్ వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా... కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకోకపోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. టీ పీసీసీ చీఫ్ పదవిపై తెలంగాణలోని పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారని... తమకు ఈ పదవి రాకపోతే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారని హైకమాండ్‌కు కొందరు నేతలు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో టీ పీసీసీ చీఫ్‌ పదవికి కొత్త వారిని ఎంపిక చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

అయితే కొత్త టీ పీసీసీ చీఫ్ కావాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో ఆలస్యం చేయడంపై అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ హైకమాండ్ తీరుతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా నిరాశలో ఉన్నారనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు