Revanth Reddy: అందుకే స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వలేదు.. కేటీఆర్, హరీశ్‌రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్

కేటీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటోలు)

Revanth reddy: కేసీఆర్ టీఆర్ఎస్‌కు ఎలా అధ్యక్షుడో.. తాను కూడా అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడినని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Share this:
    మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తనపై చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేసేందుకుహరీశ్ రావు, కేటీఆర్ పోటీపడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ది మిడి మిడి జ్ఞానమని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. జీతభత్యాలు, గన్‌మెన్లు, పీఏను ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను టీడీపీ నేతను అని పదే పదే విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.

    కేసీఆర్ టీఆర్ఎస్‌కు ఎలా అధ్యక్షుడో.. తాను కూడా అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడినని అన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హరీశ్ రావు, కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా ? అని ప్రశ్నించారు.

    Revanth reddy news, revanth reddy latest news, revanth reddy first speech as tpcc chief, congress president revanth reddy, రేవంత్ రెడ్డి న్యూస్, రేవంత్ రెడ్డి లేటెస్ట్ న్యూస్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
    తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఆ తరువాత సొంతంగా తెలంగాణ జనసమితి అనే పార్టీని స్థాపించిన కోదండరామ్.. ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ కాలేకపోయారు.


    టి కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనే అని అన్నారు. టీఆర్ఎస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అధికారాన్ని టీఆర్ఎస్ నుంచి బరాబర్ గుంజుకుంటామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఎల్.రమణను చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: