Home /News /politics /

కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి టెన్షన్... హైకమాండ్ రంగంలో...

కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి టెన్షన్... హైకమాండ్ రంగంలో...

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో అసంతృప్తిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది.

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సరికొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇందుకు అసలు కారణం... ఆ పార్టీలోని అంతర్గత విభేదాలే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి. అంతకుముందు రోజు ఉత్తమ్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియాకు ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు హుజూర్ నగర్‌లో కిరణ్ రెడ్డి అనే మరో అభ్యర్థిని ఆయన ప్రతిపాదించినట్టు వార్తలు వచ్చాయి.

    అయితే కాంగ్రెస్ హుజూర్ నగర్ బరిలో పద్మావతికి టికెట్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే పద్మావతికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్... ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సర్ది చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్‌లో పద్మావతి గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్టు కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో అసంతృప్తిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




    First published:

    Tags: Congress, Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Revanth reddy, Sonia Gandhi

    తదుపరి వార్తలు