రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్... కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ

తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త విభేదాలు తెరపైకి వచ్చాయి. పద్మావతిని హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.

news18-telugu
Updated: September 18, 2019, 4:51 PM IST
రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్... కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే, తన సతీమణి పద్మావతి పేరును టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో సమావేశమైన రేవంత్ రెడ్డి... ఉత్తమ్ ఏకపక్షంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కు ఈ అంశంలో షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కుంతియాను కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని కుంతియా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. హుజూర్ నగర్‌లో స్థానికుడైన కిరణ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని తాము ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నామని రేవంత్ రెడ్డి కుంతియా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి 14 రోజుల కంటే తక్కువ రోజుల బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ చెల్లదని అన్నారు. ఈ విషయం అసెంబ్లీ రూల్స్ బుక్‌లోనే ఉందని అన్నారు. విద్యుత్‌పై సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం సరికాదని అన్నారు. యురేనియం సమస్యపై టీడీపీలో ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నానని రేవంత్ రెడ్డి... దీనిపై సంపత్‌కు అవగాహన లేదని అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 18, 2019, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading