Home /News /politics /

REVANTH REDDY COMMENTS ON CM KCR STRATEGY ON CM SEAT TO KTR AND ASSEMBLY ELECTIONS AK

KCR Revanth Reddy: కేసీఆర్‌ వ్యూహంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అలా జరగబోతోందంటూ...

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR Revanth Reddy: కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 72 సీట్లు గెలుస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

    టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్‌పై విమర్శలు కురిపించడంలో దూకుడు పెంచారు. తనపై విమర్శలు చేసిన కేటీఆర్, హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ వ్యూహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌, తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అంతేకాదు కేటీఆర్‌ తెలంగాణ సీఎం అయ్యే అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఇవ్వడని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 72 సీట్లు గెలుస్తామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఎవరూ టికెట్ అడగరని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నుంచి తాను పోటీ చేస్తాననేది ప్రచారం మాత్రమేనని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

    అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తనపై చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేసేందుకుహరీశ్ రావు, కేటీఆర్ పోటీపడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ది మిడి మిడి జ్ఞానమని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. జీతభత్యాలు, గన్‌మెన్లు, పీఏను ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను టీడీపీ నేతను అని పదే పదే విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.

    కేసీఆర్ టీఆర్ఎస్‌కు ఎలా అధ్యక్షుడో.. తాను కూడా అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడినని అన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీవారే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. హరీశ్ రావు, కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా ? అని ప్రశ్నించారు. టి కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనే అని అన్నారు. టీఆర్ఎస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అధికారాన్ని టీఆర్ఎస్ నుంచి బరాబర్ గుంజుకుంటామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఎల్.రమణను చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు