శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రేవంత్ రెడ్డి అరెస్ట్...

ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: March 5, 2020, 6:32 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రేవంత్ రెడ్డి అరెస్ట్...
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రాజకీయంగా కొత్త సవాల్ విసిరారనే చెప్పాలి. మరి.. తనదైన వ్యహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే కేసీఆర్.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తుగడను ఏ రకంగా తిప్పుకొడతారన్నది ఆసక్తికరంగా మారింది.
  • Share this:
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... తాజాగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేటీఆర్ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్ రెడ్డి, కృష్టారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే వీటిని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో... ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిపై ఐపీసీ 184, 187 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... ఆరు పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్‌ను కూడా ఫైల్ చేసినట్టు సమాచారం.

మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్వాడ దగ్గర అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకుని... అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను జన్వాడ వస్తే... పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు.

Published by: Kishore Akkaladevi
First published: March 5, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading