Home /News /politics /

REVANTH REDDY AND JAGGA REDDY MEETING IN TELANGANA ASSEMBLY CLP A NEW POLITICAL EQUATION IN CONGRESS AK

Telangana Congress: జగ్గారెడ్డితో సమావేశం.. రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారా ?

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి సైతం జగ్గారెడ్డి విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో... కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి పూర్తిగా ఒంటరయ్యారనే చర్చ కూడా జరుగుతోంది.

    తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై పరోక్షంగా మండిపడుతున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. సీఎల్పీతో ఇద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత రహస్యంగా 20 నిమిషాలు పాటు భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సమావేశం అనుకోకుండా జరిగిందా ? లేక రేవంత్ రెడ్డి స్వయంగా జగ్గారెడ్డిని కలిసేందుకు వచ్చారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి తీరుతో తాను అసంతృప్తికి గురైనట్టు పార్టీ నేతలకు, శ్రేణులకు చెప్పారు. తనకు ప్రాధాన్యత లేని చోట ఉండటం ఎందుకని పార్టీకి రాజీనామా చేస్తానని కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. అయితే పార్టీ నేతలు నచ్చజెప్పడంతో తన రాజీనామా వ్యవహారంపై కాస్త వెనక్కి తగ్గారు. ఆ తరువాత నియోజకవర్గంలోని అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

    తన నిర్ణయాన్ని కొద్దిరోజుల తరువాత ప్రకటిస్తానని అన్నారు. త్వరలోనే సంగారెడ్డిలో భారీ సభ పెడతానని ప్రకటించిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా ? లేక పార్టీని వీడతారా ? అన్నది ఇంకా తెలియడం లేదు. అయితే జగ్గారెడ్డి వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పరోక్షంగా కామెంట్స్ చేశారు. నాటకాలు చేసేవాళ్లను పార్టీ పట్టించుకోదని కామెంట్ చేశారు. దీంతో జగ్గారెడ్డిని పార్టీ లైట్ తీసుకుందనే ఊహాగానాలు వినిపించాయి. రేవంత్ రెడ్డి సైతం జగ్గారెడ్డి విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో... కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి పూర్తిగా ఒంటరయ్యారనే చర్చ కూడా జరుగుతోంది.

    కానీ ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సమావేశం కావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు చవిచూడటంతో.. తెలంగాణలోనూ ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని చాలామంది భావిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్లు కాంగ్రెస్‌ను వీడతారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో జగ్గారెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం కొత్త చర్చకు తెరలేపింది. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారా ? అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే సీఎల్పీలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి మధ్య జరిగిన భేటీతో జగ్గారెడ్డి కూల్ అయ్యారా ? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తే తప్ప ఓ క్లారిటీ రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jagga Reddy, Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు