తెలకపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కాంగ్రెస్ నేతలు నేడు ఆ ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు.

news18-telugu
Updated: October 17, 2020, 3:38 PM IST
తెలకపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
రేవంత్‌రెడ్డి(Image-Facebook/Anumula Revanth Reddy)
  • Share this:
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కాంగ్రెస్ నేతలు నేడు ఆ ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. ఉప్పునుంతల నుంచి కొల్లాపూర్‌ వరకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో తెలకపల్లి వల్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని వాహనాన్ని కూడా పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగకుండా గంటపాటు అలానే ఉన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు నాగర్‌కర్నూల్- అచ్చంపేట రహదారిపై బైఠాయించారు. రేవంత్ సహా మిగతా నేతలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

అయితే ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి కారులో నుంచి పోలీసులతో మాట్లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రేవంత్‌రెడ్డి కాలికి స్వల్ఫ గాయమైంది. దీంతో రేవంత్, మల్లు రవి, సంపత్‌కుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉప్పునుంత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే సొరంగ మార్గం పనులు చేపట్టారని పేర్కొన్నారు. కమీషన్‌ కోసమే ఓపెన్‌ కెనాల్‌గా ఉన్న డిజైన్‌ను సొరంగమార్గం కింద మార్చారని ఆరోపించారు.

అసలేం జరిగింది?
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఈ పథకం మొదటి దశ లిఫ్టు పంపుహౌస్‌ లోపల పంపింగ్‌ నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి మోటార్‌ బిగించిన ఫౌండేషన్‌ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. దీంతో వరదనీరు ఒక్కసారిగా పంప్‌హౌస్‌లోకి చేరింది. నీటిని ఆపే అవకాశం లేకపోవడంతో కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌస్‌లోని చాలా అంతస్తుల్లోకి నీరు చేరింది. నీటిని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సిబ్బంది, ఇంజనీర్లు బయటకు పరుగులు తీశారు. ఉన్నతాధికారులకు ప్రమాదం గురించిన సమాచారం తెలియజేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 17, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading