హోమ్ /వార్తలు /National రాజకీయం /

రెండుగా చీలిన BJP.. ఆ వర్గాలివే - రాష్ట్ర DGPపైనే CM KCR నిఘా : Revanth reddy

రెండుగా చీలిన BJP.. ఆ వర్గాలివే - రాష్ట్ర DGPపైనే CM KCR నిఘా : Revanth reddy

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఫక్తు వ్యాపార సంస్థ అని, దాని ఎండీ కేసీఆర్, డైరెక్టర్ లాంటి ఈటలను కావాలనే బీజేపీలోకి పంపారని, కేసీఆర్ దెబ్బకు తెలంగాణ బీజేపీ రెండుగా చీలిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో కులాల కుంపట్లు కొనసాగుతున్నాయని, ఏకంగా డీజీపీపైనే నిఘాకు సీఎం కేసీఆర్ ఆదేశించారనీ ఆయన బాంబు పేల్చారు..

ఇంకా చదవండి ...

హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad by election) తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని హస్తం గుర్తుపార్టీ సీనియర్లు చెబుతోంటే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మరో అడుగు ముందుకేసి.. టీబీజేపీ రెండుగా చీలిపోయిందని, అది కూడా కేసీఆర్ కారణంగానే జరిగిందని చెప్పారు. పోలీస్ శాఖలోనూ కులాధిపత్య పోకడలు సాగుతున్నాయని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర డీజీపీపై ఓ వెలమ అధికారితో సీఎం కేసీఆర్ నిఘా పెట్టించారని రేవంత్ ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్.. బీజేపీ, టీఆర్ఎస్ లకు సంబంధించి మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

‘కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మక్కైందని మంత్రి కేటీఆర్ మతిలేని మాటలు చెబుతున్నారు. నిజానికి కుమ్మక్కైందే వాళ్లిద్దరు. టీఆర్ఎస్ అనే వ్యాపార సంస్థకు ఎండీ లాంటి కేసీఆర్ తన డైరెక్టరైన ఈటలను కావాలనే బీజేపీలోకి పంపాడు. కేసీఆర్ దెబ్బకు బీజేపీ రెండుగా చీలిపోయింది. కేసీఆర్ అనుకూల వర్గం, వ్యతిరేకవర్గాల మధ్య పెద్ద తగాదా నడుస్తోంది. బీజేపీ పోస్టర్లలో కేసీఆర్ కులానికి చెందిన మురళీధర్ రావు ఫొటోలు పెద్ద సైజులో ఉంటే, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫొటోలు మాత్రం రెవెన్యూ స్టాంపు సైజును దాటడంలేదు. బీజేపీలో బండి సంజయ్ కి విలువ లేదు..

Huzurabad దెబ్బ : 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ! -రహస్య భేటీపై రచ్చ రచ్చ

బీజేపీలో కేసీఆర్ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఉన్నట్లే, పోలీస్ శాఖలోనూ రెండు కులాల మధ్య చీలిక కొనసాగుతోంది. కేసీఆర్ తన కులస్తులైన మాజీ అధికారులకు మళ్లీ పోస్టింగ్స్ ఇవ్వడంతో పోలీస్ శాఖ రెండుగా చీలిపోయింది. డీజీపీ సామాజికవర్గాన్ని అనుమానిస్తూ ఆయన కంటే తక్కువ ర్యాంకులో ఉన్న వెలమ అధికారి ద్వారా సీఎం కేసీఆర్ నిఘా పెట్టించారు. రిటైరైన, ఏపీ నుంచి డిప్యూటేషన్ పై తీసుకొచ్చిన తన కులస్తులకు కేసీఆర్ కీలక పోస్టింగ్స్ ఇస్తూ దందా దళాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి నిర్బంధాన్ని ఎన్నడూ చూడని జనం.. అయ్యో.. నక్సలైట్లు లేకుండా పోయారే.. అని బాదపడే పరిస్థితి వచ్చింది.

sad news: పెద్దల పంతానికి మరో ప్రేమజంట బలి -కొండలు, సంధ్య విషాదాంతం

ఫక్తు రైతు వ్యతిరేక బీజేపీ ఏ ముఖం పెట్టుకుని హుజూరాబాద్ లో ఓట్లు అడుగుతుంది? కేంద్రం పన్నులకు అదనంగా జనానని లూటీ చేస్తోన్న టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచిన బీజేపీకి, వాళ్లకు వత్తాసుపలికే టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఉద్యమాల గడ్డగా పేరుపొందిన తెలంగాణను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చేసింది. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నాడు..

Instagram : అమ్మాయి మోసం చేస్తే కుటుంబం కాపాడింది.. కానీ నవీన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

తమ పతనం ఖరారైందని తెలుసుకాబట్టే కేసీఆర్, కేటీఆర్, కవితలు సొంత పనుల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ పార్టీ లో త్వరలో ముసలం పుడుతుంది. కేసీఆర్ సర్కార్ నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది. హుజూరాబాద్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీనే. బాల్మూరు వెంకట్ స్థానికత గురించి అర్థంలేని వాదన తెరపైకి తెచ్చారు. కేసీఆర్ సొంతూరు గజ్వేల్ కాదు, హరీష్ రావుది సిద్దిపేట కాదు, మంత్రి ktr సిరిసిల్లలో పుట్టలేదు. అలాంటప్పుడు హుజూరాబాద్ లో వెంకట్ నాన్ లోకల్ ఎలా అవుతాడు?’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

First published:

Tags: CM KCR, Congress, Huzurabad, Huzurabad By-election 2021, Revanth Reddy

ఉత్తమ కథలు