బీజేపీతో కలవాలని శివసేనకు కేంద్రమంత్రి సూచన.. మహారాష్ట్రలో మళ్లీ ఏం జరగబోతోంది?

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శనివారం ఓ హోటల్‌లో కలవడం రాష్ట్ర హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో...కేంద్రమంత్రి అథవాలే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

news18-telugu
Updated: September 28, 2020, 11:20 PM IST
బీజేపీతో కలవాలని శివసేనకు కేంద్రమంత్రి సూచన.. మహారాష్ట్రలో మళ్లీ ఏం జరగబోతోంది?
ప్రధాని మోదీతో సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
మహారాష్ట్రలో 25 ఏళ్ల పాటు కలిసి ఉన్న కాషాయ పార్టీలు బీజేపీ, శివసేన ఇప్పుడు ఉప్పు నిప్పులా మారాయి. అధికారం కోసం కొట్లాడి.. ఆ తర్వాత దూరమయ్యాయి. ప్రస్తుతం పరస్పర విమర్శలతో మరాఠా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో శివసేనకు కేంద్రమంత్రి, ఆర్‌పీఐ (ఏ) (Republican Party of India (A)) పార్టీ నేత రాందాస్ అథవాలే కీలక సూచన చేశారు. మళ్లీ బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు అధికారాన్ని పంచుకునే ఫార్ములాను కూడా ప్రతిపాదించారు. ఇప్పటి నుంచి మరో ఏడాది పాటు ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉండాలని.. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటారని అథవాలే అన్నారు. అంతేకాదు కేంద్రంలో శివసేనకు ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు వస్తాయని చెప్పారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన రాందాస్ అథవాలే... ''శివసేన మళ్లీ బీజేపీలో కలవాలి. ఒకవేళ శివసేన ముందుకు రాకుంటే శరద్ పవార్ ముందుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీయేలో చేరాలి. భవిష్యత్‌లో ఆయనకు పెద్ద పదవి ఇచ్చే అవకాశముంది. శివసేనతో ఉంటే ఎన్సీపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు.'' అని పేర్కొన్నారు.మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శనివారం ఓ హోటల్‌లో కలవడం రాష్ట్ర హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో...కేంద్రమంత్రి అథవాలే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐతే దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీపై సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఉన్న సంజయ్ రౌత్‌ స్పందించారు. ఫడ్నవీస్‌ను సామ్నా పత్రికలో ఇంటర్వ్యూ కోసం మాత్రమే కలిసినట్లు క్లారిటీ ఇచ్చారు.కాగా, 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 57 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అధికారం విషయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి ఏర్పాటు చేసింది. అనంతరం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఉద్ధవ్ థాక్రేను సీఎం చేశాయి. అప్పటి నుంచి శివసేన, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం పెరిగింది. కేంద్రంలో మోదీ నిర్ణయాలను తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ వస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయోధ్య రామమందిర భూమి పూజకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఆహ్వానం అందలేదు. ఇక ఇటీవల కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను కూడా శివసేన వ్యతిరేకించింది.
Published by: Shiva Kumar Addula
First published: September 28, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading