ట్రంప్‌కు షాక్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలుపు

ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరిగింది. 36 రాష్ట్రాలకు గవర్నర్‌ పదవులకు, ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి

news18-telugu
Updated: November 7, 2018, 3:49 PM IST
ట్రంప్‌కు షాక్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలుపు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలుపు
  • Share this:
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లు షాకిచ్చారు. దీంతో ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ గెలుపు సాధించింది.

అమెరికా ప్రతినిధుల సభకు ప్రతి రెండేళ్లకోసారి, సెనెట్ కు ప్రతి ఆరేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయి.ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరిగింది. 36 రాష్ట్రాలకు గవర్నర్‌ పదవులకు, ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ గెలుపు బావుటా ఎగురవేసింది. ఇప్పటివరకూ ప్రతినిధుల సభలో ఆధిక్యం చలాయించిన రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితం అయ్యారు.అయితే ఎగువ సభ సెనెట్ లో మాత్రం రిపబ్లికన్లు తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. అక్కడ ఎన్నికలు జరిగిన 35 సీట్లలో 26 స్థానాలను రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది.

అయితే ఈ ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం మధ్యలో జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుకు తీర్పుగా భావిస్తున్నారు.దీంతో వలసదారులపై ట్రంప్ దుందుడుకు చర్యలు, 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి రష్యా సాయం సహా పలు విషయాల్లో అధ్యక్షుడి నిర్ణయాలను డెమొక్రాట్లు అడ్డుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ డెమొక్రాట్ల అంగీకారం తప్పనిసరి.
Published by: Sulthana Begum Shaik
First published: November 7, 2018, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading