ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్... ప్రారంభమైన ఓటింగ్

ప్రతీకాత్మక చిత్రం

అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరగనుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో రెండుచోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

  • Share this:
    ఏపీలో ఐదుచోట్ల రీపోలింగ్ ప్రారంభమైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరగనుంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో రెండుచోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు 94వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరుగుతోంది. దీంతో పాటు...గుంటూరు వెస్ట్ అసెంబ్లీ పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు పోలింగ్ జరగనుంది. ఇటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని 247 పోలింగ్ స్టేషన్ పరిధిలోని అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు రీపోలింగ్ జరగుతోంది. నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ పరిధిలోని ఇన్కపాలెం 41వ నెంబర్ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ,పార్లమెంట్ స్థానాలకు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. సుళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన అటకానితిప్పలోని 197వ పోలింగ్ స్టేషన్‌లో కేవలం పార్లమెంట్ స్థానానికి సంబంధించి రీపోలింగ్ జరుగుతోంది.

    రీపోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ప్రత్యేక పరిశీలకుల్ని నియమించారు. మొత్తం ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో 5064 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లకు స్లిప్పుల్ని కూడా పంపిణీ చేశారు.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గతనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఐదుచోట్ల పోలింగ్ జరపాలన్న రాష్ట్ర సీఈవో గోపాల్ కృష్ణ ద్వివేది సిఫారసు మేరకు రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    First published: