కారు పార్టీ.. ఓ బేకార్ పార్టీ: కేసీఆర్‌పై రేణుకాచౌదరి ఫైర్

ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి నేతల ప్రచారం ఊపందుకుంది. భాగస్వామ్య పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కూటమి అభ్యర్థి నామనాగేశ్వర్రావుకు మద్దతుగా కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ప్రచారం నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: November 24, 2018, 4:22 PM IST
కారు పార్టీ.. ఓ బేకార్ పార్టీ: కేసీఆర్‌పై రేణుకాచౌదరి ఫైర్
renuka-coments-on-kcr-and-trs-governament
news18-telugu
Updated: November 24, 2018, 4:22 PM IST
తెలంగాణలో కేసీఆర్‌ను, కేంద్రంలో మోదీని ఇంటికి పంపిస్తామని కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మంలో పదికి పదిస్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేవారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

ఖమ్మంలో కూటమి అభ్యర్థి నామ నాగేశ్వర్‌రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన రేణుకాచౌదరి.. టీఆర్ఎస్ పార్టీపై విమర్శలతో విరుచుపడ్డారు. తెలంగాణలో కారు పార్టీ.. ఒక బేకార్ పార్టీ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను దగా చేశారని, మోదీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

అవకాశవాదంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని రేణుక పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానికాన్ని అహంకారంతో అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న మోదీ, కేసీఆర్ ద్వయాన్ని ఇంటిదారి పట్టిస్తామని చెప్పారు. త్వరలోనే రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రజా కూటమి పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతుందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని రేణుక స్పష్టం చేశారు.

 

First published: November 24, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...