హోమ్ /వార్తలు /రాజకీయం /

కొబ్బరిబొండాలు కొట్టిన ఫైర్ బ్రాండ్... రేణుకా చౌదరి వినూత్న ప్రచారం

కొబ్బరిబొండాలు కొట్టిన ఫైర్ బ్రాండ్... రేణుకా చౌదరి వినూత్న ప్రచారం

ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి

ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి

కొబ్బరి బోండాలు కొట్టి అంద‌రిని ఆశ్చర్య పరిచారు .ఒక వైపు ఎండ వేడిమి... మరో వైపు ఎన్నికల వేడి... దీంతో చల్లదనం కోసం కొబ్బరి బోండాల దుకాణం దగ్గర ఆగారు రేణుక.

    కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాలు కొట్టి అంద‌రిని ఆశ్చర్య పరిచారు .ఒక వైపు ఎండ వేడిమి... మరో వైపు ఎన్నికల వేడి... దీంతో చల్లదనం కోసం కొబ్బరి బోండాల దుకాణం దగ్గర ఆగారు రేణుక. అక్కడున్న బోండాలు కొట్టే కత్తి తీసుకొని కొబ్బరి బొండాలు కొట్టారు. . పాల్వంచ పట్టణంలో ప్రచారంలో ఈ సిత్రం చోటు చేసుకుంది. రేణుక రోడ్ షో కు ప్రజలు మండే ఎండను సైతం పట్టించుకోకుండా బ్రహ్మ రధం పట్టారు. మహిళలు , నాయకులు ,ప్రజలు భారీగా వచ్చి రోడ్డు మీద కిలో మీటర్ల పొడవునా బారులు తీరారు. బస్టాండ్ సెంటర్ , అంబేడ్కర్ సెంటర్ మీదుగా బోసు సెంటర్ చేరుకుని ప్రజలను ఉద్దేశించి రేణుక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంభాని చంద్రచేఖర్,యెడవల్లి కృష్ణ, టీడీపి నాయకుడు కోనేరు చిన్ని, intuc నాయకులతో పాటు పలువురుపార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.


    ఖ‌మ్మ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాయి పార్టీలు. ఈ క్రమంలో ఖమ్మంలో పార్లమెంట్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతుండగా... కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి పోటీచేస్తోన్నారు. ఇద్దరూ బలమైన నేతలు కావడంతో..అందులోనూ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో వీరిద్దరి పోరు ఉత్కంఠ రేపుతోంది

    First published:

    Tags: Khammam, Khammam S29p17, Renuka chowdhury, Telangana Lok Sabha Elections 2019, Telangana Politics