పవన్ కల్యాణ్, అలీ గొడవపై ఆరాతీసిన రేణు దేశాయ్

'జానీ' చిత్రం షూటింగ్ సమయంలో ముంబైలో పవన్, అలీలతో కలిసెళ్లి పానీపూరీ తిన్న సంగతులు రేణుదేశాయ్ గుర్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: April 14, 2019, 11:53 AM IST
పవన్ కల్యాణ్, అలీ గొడవపై ఆరాతీసిన రేణు దేశాయ్
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్
news18-telugu
Updated: April 14, 2019, 11:53 AM IST
ఇటీవల ఏపీ ఎన్నికలు మంచి స్నేహితులైన పవన్ కల్యాణ్, అలీ మధ్య చిచ్చపెట్టాయి. జనసేనను కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలి చేరడం రాజకీయంగా దుమారం లేపింది. అంతకన్నా ముందు ఆయన పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబుతోనూ భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీలో చేరిన తరువాత, అలీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదంటూ విమర్శలు చేశారు. సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని రాజమండ్రిలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు స్టార్ కమెడియన్ అలీ. వాటిని అలీ సైతం గట్టిగానే తిప్పికొట్టారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రచ్చ రచ్చైంది. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదంలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందించారు.

అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన రేణూ దేశాయ్... ఈ విషయంపై అలీని ఆరా తీశారు. మిమ్మల్ని సీరియస్‌గా ఓ ప్రశ్న అడగాలంటూ ఆమె అలీని కొరారు. ‘మీకు కల్యాణ్‌గారికి గొడవైందని విన్నాను నిజమేనా? అని రేణు ప్రవ్నించారు. దానికి అలీ అయ్యింది అని సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 'జానీ' చిత్రం షూటింగ్ సమయంలో ముంబైలో పవన్, అలీలతో కలిసెళ్లి పానీపూరీ తిన్న సంగతులు గుర్తు చేసుకున్నారు.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...