ఏపీలో గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలకు వేసిన రంగులు వైసీపీ జెండా రంగులు కాదని వాదనలు వినిపించగా.. నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించక పోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623 రద్దు చేసింది. కాగా, జగన్ సర్కారుకు హైకోర్టులోనూ చుక్కెదురైన సంగతి తెలిసిందే.
స్థానికల ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో హైకోర్టులో విచారణ జరగ్గా.. ఆ రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అదనంగా కాషాయ రంగును చేర్చుతూ రంగులు వేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏకంగా గట్టి షాక్ ఇచ్చింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.