• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • RELIEVE US FROM LAND ADMINISTRATION TELANGANA REVENUE JAC DEMANDS KCR GOVT BA

తహశీల్దార్ హత్య ఎఫెక్ట్... తెలంగాణ రెవిన్యూ జేఏసీ సంచలన డిమాండ్

తహశీల్దార్ హత్య ఎఫెక్ట్... తెలంగాణ రెవిన్యూ జేఏసీ సంచలన డిమాండ్

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

తెలంగాణ‌ రెవెన్యూ జేఏసీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం హైద‌రాబాద్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

  • Share this:
    ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన చట్టాలు, సాఫ్ట్‌వేర్ కారణంగా తాము ప్రజల్లో అపకీర్తి పాలవుతున్నామని తెలంగాణ రెవిన్యూ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో ఒకప్పుడు రైతులు, రెవిన్యూ అధికారులకు విడదీయరాని అనుబంధం ఉండేదని, కానీ నేడు కొంద‌రు రైతుల‌కు రెవెన్యూ అధికారులను శ‌త్రువులుగా స‌మాజం మార్చేసిందన్నారు. ఈ మేరకు తెలంగాణ రెవిన్యూ ఉద్యోగుల జేఏసీ ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది.

    ‘చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా రెవెన్యూ శాఖ‌ను, ఉద్యోగుల‌ను అన్ని ర‌కాలుగా బ‌ద‌నాం చేస్తున్నారు. శాఖ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇలాంటి ఇబ్బందిని చూడ‌లేదు. ప్ర‌భుత్వాలు ఏవి ఉన్నా, పాల‌కులు ఎవ‌రున్నా రెవెన్యూ శాఖ‌నే పెద్ద‌న్న పాత్ర పోషించేది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వం అంటే రెవెన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ‌నే ఉండేది. నేడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు కావాల్సిన ఆదాయాన్ని భూశిస్తు రూపంలో అందించేది. ప్ర‌తి ఏడాది ప్ర‌త్య‌క్షంగా రైతుల‌తోనే జ‌మాబంధిని నిర్వ‌హిస్తూ వారి నుంచి శిస్తు వ‌సూలు చేసేది. ఏ రైతుకు ఎంత భూమి ఉందో చెప్పేది. రైతుల‌కు, రెవెన్యూ ఉద్యోగుల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉండేది. కానీ నేడు కొంద‌రు రైతుల‌కు రెవెన్యూ అధికారులను శ‌త్రువులుగా స‌మాజం మార్చేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం లోప‌భూయిష్ట‌మైన రెవెన్యూ చ‌ట్టాలు, సాప్ట్‌వేర్‌నే. మండ‌ల స్థాయిలో ఉన్న అధికారుల‌కు రెవెన్యూ రికార్డుల‌ను స‌రిచేసే అధికారం లేదు. కొన్నింటిని స‌రి చేసేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్‌లో ఆ అవ‌కాశం లేదు. దీంతో క్షేత్ర‌స్థాయిలో భూ స‌మ‌స్య‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రైతులు వద్ద బదనాం అవుతున్నాం. అందుకే భూ పరిపాలనా నుంచి రెవెన్యూ శాఖను మినహాయించాలని కోరుతున్నాం.’ అని తెలంగాణ రెవిన్యూ జేఏసీ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

    త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హ‌నంతో తెలంగాణ రెవెన్యూ జేఏసీ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు క‌లెక్ట‌రేట్ల ముందు రిలే నిర‌హార దీక్ష‌లు చేస్తున్నారు. గురువారం మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాల‌లో క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వ‌ద్ద‌ జ‌రుగుతున్న దీక్షా శిబిరాల‌ను తెలంగాణ రెవెన్యూ జేఏసీ నాయ‌కులు సంద‌ర్శించి పై విష‌యాల‌ను మాట్లాడారు.

    సోమ‌వారం రౌండ్ టేబుల్ స‌మావేశం

    త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హ‌నం రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులను చేసింది. వారిలో ఆత్మస్థైర్యంను నింపేందుకు భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా చేసేందుకు తెలంగాణ‌ రెవెన్యూ జేఏసీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం హైద‌రాబాద్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయ, కార్మిక‌, ఫెన్ష‌న‌ర్ల సంఘాలు, అన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు పాల్గొననున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: