ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సీబీఐ కోర్టులో (CBI Court) ఊరట లభించింది. జగన్ తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ( Raghu Rama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ (Hyderabad) లోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన జగన్, విజయసాయి ప్రస్తుతం సీఎం, ఎంపీ పదవుల్లో ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని.. అందువల్ల ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా బెయిల్ జగన్, విజయసాయి బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రఘురామ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
మరోవైపు బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలిచ్చింది. విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించింది. ఈ మేరకు రఘురామ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరగా కోర్టు తిరస్కరించింది. పిటిషన్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. సహేతుకమైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సాక్షి మీడియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాత్రం హైకోర్టు బదిలీ చేసింది.
కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు... జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. మధ్యలో జగన్ బెయిల్ రద్దు కాబోతోందని రాష్ట్రానికి మరో సీఎం రాబోతున్నారన్న పుకార్లు షికార్లు కూడా చేశాయి. దీనిపై రఘురామతో పాటు ప్రతిపక్షాలు కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేశాయి.
ఐతే అందరి అంచనాలు, విశ్లేషణలను పటాపంచలు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. రఘురామకు షాకిస్తూ.. జగన్, విజయసాయికి ఊరటనిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బెయిల్ రద్ద కాదని సీఎం జగన్ ముందునుంచీ నమ్మకంతో ఉన్నారని.. అందుకే ఈనెల 16న కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju