కట్టెలతో కాకుండా గ్యాస్‌తో షీలా దీక్షిత్ అంత్యక్రియలు

81 ఏళ్ల షీలా దీక్షిత్ ఎలాంటి మూఢనమ్మకాలను పెట్టుకోకుండా తనకు గ్యాస్ విధానంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని బతికి ఉన్నప్పుడు కోరుకున్నారట.

news18-telugu
Updated: July 21, 2019, 8:21 PM IST
కట్టెలతో కాకుండా గ్యాస్‌తో షీలా దీక్షిత్ అంత్యక్రియలు
షీలా దీక్షిత్ ఫొటో (Image:PTI)
  • Share this:
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. రాజకీయాలకు అతీతంగా నేతలు తరలివచ్చి సీనియర్ రాజకీయ నాయకురాలికి నివాళి అర్పించారు. ఢిల్లీలోని షీలా దీక్షిత్ నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆమె భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత నిగమ్ బోథ్ ఘాట్‌లో షీలా దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించారు. కట్టెల్లో కాకుండా గ్యాస్‌ వినియోగించి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. 81 ఏళ్ల షీలా దీక్షిత్ ఎలాంటి మూఢనమ్మకాలను పెట్టుకోకుండా తనకు గ్యాస్ విధానంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని బతికి ఉన్నప్పుడు కోరుకున్నారట. అందుకు తగ్గట్టే ఆమె కుటుంబసభ్యులు నడుచుకున్నారు. ఈ గ్యాస్ విధానంలో దహన సంస్కారాలు ప్రక్రియను షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. షీలా దీక్షిత్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రాజకీయాలకు అతీతంగా నేతలు తరలివచ్చి షీలా దీక్షిత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ .. అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు నేతలు షీలా దీక్షిత్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. బీజేపీ పెద్దలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్‌లు షీలా దీక్షిత్ నివాసానికి వెళ్లి అంజలి ఘటించారు.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...