టీ కాంగ్రెస్‌లో 'రెడ్డి vs బీసీ'.. పదవుల కోసం రచ్చ..

అగ్రకులాల ఆలోచనల్లో మార్పు రావాలని.. బీసీల హయాంలోనే కాంగ్రెస్‌కు లాభం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: November 23, 2019, 2:40 PM IST
టీ కాంగ్రెస్‌లో 'రెడ్డి vs బీసీ'.. పదవుల కోసం రచ్చ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలయింది. పీసీసీ చీఫ్ పదవి కేంద్రంగా నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నేతల ఆధిపత్య పోరు వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని.. అందరూ కలిసికట్టుగా ఉండకుండా, వ్యక్తిగత రాజాకీయాలు చేస్తారని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇక పీసీసీ చీఫ్ మారుస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. నేనే పీసీసీ అధ్యక్షుడిని ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. రేస్‌లో ముందున్నానని.. హైకమాండ్ కూడా నావైపే ఉందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలో ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఇందిరా గాంధీ తరహాలోనే సోనియా కూడా బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా ప్రకారం బీసీలకే పీసీసీ పదవి ఇవ్వాలి. డీఎస్ హయాంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అగ్రకులాల ఆలోచనల్లో మార్పు రావాలి. నాకు ప్రజల్లో మంచి పేరుంది. అనుభవం ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వయసుతో పనిలేదు. 82 ఏళ్ల షీలా దీక్షిత్‌కు పదవి ఇవ్వలేదా..? బీసీల హయాంలోనే కాంగ్రెస్‌లకు లాభం జరిగింది. త్వరలో సోనియాను కలుస్తా.
వీహెచ్


ఇక భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పది రోజుల్లో పీసీసీ చీఫ్‌ను మారుస్తారని.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడగానే టీపీసీసీకి కొత్త సారథిని నియమిస్తారని తెలిపారు. పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని తెలిపారు కోమటిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నానని.. దాని కోసం పార్టీ హైకమాండ్ అనుమతి కోరినట్లు చెప్పారు.

జగ్గారెడ్డి సైతం తానూ పీసీసీ అధ్యక్షుడి పదవి రేస్‌లో ఉన్నానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకు అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ పథకాలంటే అద్భుతమైన పథకాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సీఎం పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తామని ఇంతకు ముందే తెలిపారు జగ్గారెడ్డిఐతే ఈ సారి రెడ్డిలకు కాకుండా బీసీలకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వీహెచ్. అగ్రకులాల ఆలోచనల్లో మార్పు రావాలని.. బీసీల హయాంలోనే కాంగ్రెస్‌కు లాభం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ ఫైట్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.
First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు