అక్కడ 109 శాతం పోలింగ్ జరిగిందా? ఇదేం చోద్యం అంటున్న టీడీపీ

కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో 109 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు నివేదిక ఇవ్వడంపై వర్ల రామయ్య మండిపడ్డారు.

news18-telugu
Updated: April 18, 2019, 8:01 PM IST
అక్కడ 109 శాతం పోలింగ్ జరిగిందా? ఇదేం చోద్యం అంటున్న టీడీపీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 18, 2019, 8:01 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధానంగా రెండు అంశాలను ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత రెండు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరాయని వర్ల రామయ్య ఆరోపించారు. దీంతోపాటు కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో 109 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు నివేదిక ఇవ్వడంపై వర్ల రామయ్య మండిపడ్డారు. బూత్‌లో ఉన్న ఓట్లు, అధికారులు నమోదైనట్టుగా చెప్పిన ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే 109 శాతం పోలింగ్ నమోదైనట్టుగా ఉందని, ఇదెలా సాధ్యమని వర్ల రామయ్య ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ద్వివేదీకి విజ్ఞప్తి చేశారు.

First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...