REBELS TROUBLE FOR TRS IN LOCAL BODY QUOTA MLC ELECTIONS IN KARIMNAGAR DISTRICT MKS KNR
trs mlc : రెబల్స్ ట్రబుల్ -స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గులాబీ దళంలో గ్రూపుల గుబులు
టీఆర్ఎస్
అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త తలనొప్పిని తెచ్చ పెడ్తున్నాయి . తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన అధిష్ఠానంపై స్థానిక ప్రజాప్రతినిధులు తిరుగుబాటు ప్రకటించరు .
(P.Srinivas,News18,Karimnagar)
అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) సరికొత్త తలనొప్పిని తెచ్చ పెడ్తున్నాయి . తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన అధిష్ఠానంపై స్థానిక ప్రజాప్రతినిధులు తిరుగుబాటు ప్రకటించారు . ఓ వైపు టీఆర్ఎస్ (TRS) లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంటే మరో వైపున నామినేషన్ వేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 60 మందికి పైగా నామినేషన్ ఫారాలు తీసుకెళ్లారు . పోటీ లేకుండా పోయేసరికి తమకు గుడ్ విల్ కూడా దక్కడం లేదని మథనపడుతున్న వారూ లేకపోలేదు.
ఆరు నెలల పాటు నిరాటంకంగా ప్రచారం సాగిన హుజూరాబాద్ బై పోల్స్ ప్రభావం కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పడ్డట్టుగా ఉంది . హుజూరాబాద్ ఎన్నికలో ప్రభుత్వం అక్కడి ప్రజలు , నాయకుల డిమాండ్లను పరిష్కరించింది . అదే పద్ధతిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం అవలంబిస్తుందని అంచనా వేస్తున్నారు . అందులో భాగంగానే కరీంనగర్ లో ఇప్పటికే 8 మంది రెబల్స్ ఇండిపెండెంట్లు నామినేషన్ వేయగా ... నామినేషన్ల చివరి రోజు పలువురు ఎంపీటీసీలు నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను,డిమాండ్లను. అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంపీటీసీల సంఘం సభ్యులు స్పష్టం చేశారు . ప్రభుత్వం సానుకూల స్పందన వ్యక్తం చేస్తే సరిపోదని .. జీవోలు విడుదల చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు .
రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది . నామినేషన్లకు ఈ నెల 23 వ తేదీ చివరి తేదీ కావడంతో ప్రభుత్వం నుంచి వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ రావాలని లేదంటే . మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు కొన్ని జిల్లాల్లో నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు . ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇండిపెండెంట్. అలాగే రెబల్స్ అభ్యర్థులుకూడా నామినేషన్ వేశారు .
ఈ నెల 23 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో నామినేషన్లు భారీగా వేసే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎంపీటీసీలు నామినేషన్ పత్రాలను సైతం సిద్ధం చేసుకున్నారు .ఇప్పటికే కరీంనగర్ లో 60మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లినట్లు సమాచారం..అధికారం కోసం కాదని ... కేవలం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నట్లు రెబల్స్ ఇండిపెండెంట్, ఎంపిటిసి లు వెల్లడించారు ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.